అనంత‌పురంలో టీడీపీకి షాక్

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన మాజీ వార్డు సభ్యులు, టీడీపీ నాయకులు

అనంతపురం:  రూరల్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన మాజీ వార్డు సభ్యులు గంగాధర్, షెక్షావాలి, నాయకుడు మంజునాథ్ ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. శుక్రవారం అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వారికి వైయ‌స్ఆర్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలపరిచే సర్పంచ్, వార్డు అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్, అనంతపురం రూరల్ పంచాయతీ నాయకులు మహేష్, సుధాకర్‌రెడ్డి, నగేష్, అశోక్, శీనా తదితరులు పాల్గొన్నారు.

Back to Top