విజయవాడ: జనసేనకు చెందిన కొందరు ఎక్స్ స్పేస్ వేదికగా మహిళలను, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ వైయస్ జగన్ కుటుంబ సభ్యులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు గట్టిగా స్పందించారు. జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వారు ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్టేషన్ బయట మీడియాతో మాట్లాడిన పార్టీ నాయకులు ఎవరెవరు ఏమన్నారంటే..: దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొండి. :దేవినేని అవినాష్, వైయస్‌ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. మరి వారి నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్న సినిమా డైలాగులు చెప్పడం కాదు.. నిజంగా చర్యలు తీసుకోవాలి. దమ్ముంటే జగన్‌గారిని, వైయస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రాజకీయంగా ఎదుర్కోండి. కుటుంబ సభ్యులపై నీచ వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేము ఎదురుతిరుగుతాం. వైయస్ జగన్ కుటుంబ సభ్యుల మానవత్వం ఏంటో తెలుసుకోవాలంటే విజయవాడ కృష్ణలంకలోని శిశుభవన్‌లో అనాథలు, వికలాంగ పిల్లలను అడగండి చెబుతారు. బందర్ లాకులోని నిర్మల్ భవన్‌లో వృద్ధులను సొంత బిడ్డల్లా ఆదరిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. 24 గంటల్లో చర్యలు తీసుకోండి.. లేకుంటే ఉద్యమ కార్యాచరణ :మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ఎక్స్ స్పేస్‌లో ఎవరు, ఏ సమయంలో, ఏ అకౌంట్ ద్వారా ఏం మాట్లాడారో, ఏ ఫోన్ నంబర్ల నుంచి మాట్లాడారో పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై గతంలో వందల కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు పూర్తి ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం. 24 గంటల్లో చర్యలు లేకపోతే వైయస్‌ఆర్‌సీపీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై ఎవరూ మాట్లాడకూడదని జగన్‌గారు స్పష్టమైన పార్టీ విధానాన్ని ప్రకటించారు. అదే సమయంలో జనసేనకు చెందిన వారు మాత్రం జగన్‌గారి కుటుంబ సభ్యులపై ఇష్టానుసారం మాట్లాడటం వారి నీచ రాజకీయ సంçస్కృతిని బయటపెడుతోంది. జగన్‌గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం ప్రజల ముందు వారి స్థాయిని మరింత దిగజార్చుకోవడమే. మహిళలు, విద్యార్థులను కాపాడలేని ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై రాజకీయాలు చేయడం కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాలి. ఎక్స్ స్పేస్‌లో పాల్గొన్న 350 మందిపై చర్యలు తీసుకోవాలి. :దొడ్డ అంజిరెడ్డి. పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌గారు. ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం సిగ్గు పడేలా ఎక్స్ స్పేస్‌లో దాదాపు 350 మంది మాట్లాడారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన అకౌంట్ వివరాలు, లింకులు, ఇతర పూర్తి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఫిర్యాదు చేసి వదిలేసే వ్యవహారం కాదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం.