వైయస్‌ జగన్‌ను కలిసిన షేక్‌ ఫాతిమాబీ

నందికొట్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఫాతిమబీ

తాడేప‌ల్లి: నందకొట్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సనగా ఎన్నికైన షేక్‌ ఫాతిమాబీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
    కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నందికొట్కూరులో మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్‌ కేంద్రంలో కూడా వెన్నుపోటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన అరాచకాలను వివరించారు. తను ఓడిపోయినట్లు ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు.
    అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నందికొట్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు ఫాతిమాబీని, శ్రీ వైయస్‌ జగన్‌ అభినందించారు. ప్రజలకు చేరువై నిత్యం వారితో మమేకం అవుతూ, వారి కష్టాలు తీర్చేందుకు పని చేయాలని ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఆమెకు సూచించారు.
    వైయస్సార్‌సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్‌ సుధీర్‌తో పాటు.. షేక్‌ ఫాతిమాబీ భర్త, పార్టీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్‌ అహ్మద్, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ అబ్ధుల్‌ గఫార్‌ కూడా ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Back to Top