తాడేప‌ల్లిలో పోలీసుల దాష్టీకం

పోలింగ్ కేంద్రం వేమారెడ్డి ప‌ట్ల దురుసు ప్ర‌వ‌ర్త‌న 

 
 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ మంగళగిరి మాజీ ఇన్‌చార్జి, వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి చీఫ్‌ ఏజెంట్‌ వేమారెడ్డి ప‌ట్ల పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఆయ‌న్ను పోలింగ్‌ కేంద్రం నుంచి పోలీసులు బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపించ‌డం ప‌ట్ల పార్టీ వర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. టీడీపీ నేతల ఆదేశాలతోనే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణులు గుమిగూడినా పోలీసులు పట్టించుకోలేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు గుమిగూడిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని, వీడియోలు తీయొద్దంటూ హెచ్చరించినట్లు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top