శ్రీరాంపురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌పై దాడి 

 పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ నేత కేసుబాబు దౌర్జన్యం.. రక్తం వచ్చేలా దాడి 

ఎన్టీఆర్ జిల్లా : రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ బూత్‌ వద్ద ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌ వెల్ది రాంబాబుపై టీడీపీ నేత కేసుబాబు, ఆయన అనుచరులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రం వద్దే రాంబాబును దూషిస్తూ కేసుబాబు తన అనుచరులతో కలిసి దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో రాంబాబుకు రక్తం వచ్చేలా గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

దాడి అనంతరం కేసుబాబు, ఆయన అనుచరులు పోలింగ్‌ బూత్‌లోకి చొరబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Back to Top