రాప్తాడులో టీడీపీ వర్గీయుల దాష్టీకం

 కోనాపురం, పాతపాళ్యం, నరసంపల్లి, తగరకుంటలో ఉద్రిక్తత

వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థి భర్తపై దాడులు 

అనంతపురం: పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనాపురం, పాతపాళ్యం, నరసంపల్లి గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు వైయ‌స్ఆర్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లపై దాడులకు పాల్పడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తగరకుంటలో వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థి భర్తపై కూడా టీడీపీ వర్గీయులు దాడి చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. నాగసముద్రంలోనూ పోలింగ్‌ కేంద్రం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు, ఓట్లు వేస్తే చంపుతామని బెదిరింపులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

పలు గ్రామాల్లో జరిగిన ఘటనలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలని వారు కోరారు.

Back to Top