కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య హౌస్ అరెస్ట్

 పంచాయతీ ఎన్నికల వేళ పోలీసుల చర్యపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం 

 అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ సమన్వయకర్తను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల సమయంలో అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.

Back to Top