తాడేపల్లి: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం.. భారత రాజ్యాంగానికి నాలుగు మూలస్తంభాలు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి అసలైన ఆత్మ’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నిజమైన నివాళి మాటల్లో కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చూపించడంలోనే ఉంది. ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడాలి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చూడటమే అంబేద్కర్ ఆశయాలకు నిజమైన గౌరవం’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.