పల్నాడు జిల్లా: నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రానివ్వకుండా టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లు ఆరోపించారు. పోలింగ్ బూత్ నుంచి తమను ఎందుకు బయటకు పంపిస్తున్నారంటూ వైయస్ఆర్‌సీపీకి చెందిన మహిళా ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేశారని, అందుకే బూత్ నుంచి బయటకు పంపించారని వారు తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లు కోరారు.