సంబేపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల బహిష్కరణ

ఎస్సీ రిజర్వ్‌ స్థానంలో బీసీ అభ్యర్థి పోటీపై వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుల ఆగ్రహం 

అన్నమయ్య జిల్లా: సంబేపల్లి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు బహిష్కరించారు. ఎస్సీకి రిజర్వ్‌ చేసిన సర్పంచ్‌ స్థానంలో టీడీపీ మద్దతుతో బీసీ అభ్యర్థి పోటీ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తమపై పోలీసులు దాడి చేశారని వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికలను రద్దు చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Back to Top