ఫ్యాన్‌ వైపు ప్రజల మొగ్గు స్పష్టం

వైయ‌స్ఆర్‌సీపీ గెలుపుపై ధీమా: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నారని, చంద్రబాబు పాలనలో మోసపోయామని భావిస్తున్న ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. కాకినాడ మేయర్‌ స్థానంతో పాటు అత్యధిక కార్పొరేటర్‌ స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకునే అవకాశం ఉందని ద్వారంపూడి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top