అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ హ‌ల్‌చ‌ల్‌

 వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు 

నంద్యాల జిల్లా: అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్‌ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపైకి కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాన్వాయ్‌ కింద మహిళ చిక్కుకుపోవడంతో తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరాయి.

 రాజమండ్రిలో సోము వీర్రాజు ఓవరాక్షన్ 

రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను ఎందుకు అనుమతించారంటూ ఆయన హడావుడి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొడకొట్టి ‘బస్తీమే సవాల్’ అంటూ రెచ్చిపోయిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top