అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరఫున ఎంపీటీసీలుగా విజయం సాధించిన నార్పల స్వాతిలతారెడ్డి, నార్పల ప్రసన్నకుమారిరెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. తమపై నమ్మకం ఉంచి విజయాన్ని అందించిన ప్రజలకు నేరుగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి జరిగిన కృషికి ప్రజల నుంచి లభించిన ఆదరణకు నార్పలలో తమ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.