తాడేపల్లి: రాప్తాడు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో గోపికను రక్షించే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మిని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి, ఆమె కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వైయస్ఆర్‌సీపీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. కుటుంబానికి అవసరమైన సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.