కర్నూలు జిల్లా : ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న నెపంతో కూటమి నేతలు కక్షసాధింపు చర్యలకు తెర లేపారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 44వ వార్డులో పేదల నివాసాల కూల్చివేత వివాదానికి దారితీసింది. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఇబ్రహీంకు మద్దతు తెలిపినందుకే తన రేకుల షెడ్డు కూల్చివేశారని బాధితుడు షఫీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అభ్యర్థి వై. ఈరన్న వైయస్ఆర్‌సీపీకి మద్దతు ఇస్తే రేకుల షెడ్డు పీకిస్తానని హెచ్చరించారని, ఎన్నికల్లో గెలిచిన వెంటనే చెప్పినట్లుగానే తన నివాసాన్ని కూల్చివేశారని షఫీ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు పదేళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా ఇళ్లను తొలగించడం సరికాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల నివాసాల కూల్చివేత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. లేక నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టారా అన్నది అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ కక్షల కోసం పేదల నివాసాలను బలిపశువులను చేయవద్దని, షఫీ కుటుంబానికి తక్షణ న్యాయం చేసి ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.