తాడేపల్లి: అనంతపురం నగర మేయర్‌గా ఎన్నికైన సి. రమేష్ గౌడ్ తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌ను అభినందించిన వైయస్ జగన్, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. అనంతపురం ప్రజలు వైయస్ఆర్‌సీపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనంతపురం నగర ప్రజలు ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని వైయస్ జగన్ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని రమేష్ గౌడ్‌ను ఆశీర్వదించారు. తనపై నమ్మకం ఉంచి మేయర్‌గా అవకాశం కల్పించిన వైయస్ జగన్‌కు రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అనంతపురం నగర ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. మేయర్‌గా లభించిన అవకాశాన్ని బాధ్యతగా భావించి ప్రజల సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కూడా వైయస్ జగన్‌ను కలిశారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, సాకే శైలజానాథ్, తలారి రంగయ్య, నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.