తిరుపతి జిల్లా: సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైయస్సార్‌సీపీ కలత్తూరు ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డిని టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం మండలం ఎంపీపీ పదవి కోసం టీడీపీ కుట్రలకు తెరలేపింది. రేపు ఎంపీపీ పదవికు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. కేవీబీ పురం మండలంలో వైయస్సార్‌సీపీఇకి 6 ఎంపీటీసీలు, టీడీపీ 6 ఎంపీటీసీల స్థానాలు రాగా, మెజారిటీ కోసం వైయస్సార్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేత కిడ్నాప్ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ కుట్ర రాజకీయాలు చేసింది. కాళంగి అదరం ఎంపీటీసీ స్థానం లక్ష్మీ శోభన వైయస్సార్‌సీపీ నుంచి గెలుపొందగా.. ఎన్నికల కౌంటింగ్ రోజు కుట్ర చేసి.. టీడీపీ అభ్యర్దిని మీనాక్షి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తాజాగా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి.. ఎంపీపీ కోసం టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. కూటమి అరాచకాలపై న్యాయ పోరాటం: ఎంపీ గురుమూర్తి వైయస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సందర్భంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కేవీబీ పురం జడ్పీటీసీ వైయస్సార్‌సీపీ గెలిస్తే.. టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని గురుమూర్తి అన్నారు.