పాద‌యాత్ర ప్రారంభించిన‌ మొండితోక జగన్మోహనరావు  

వీరులపాడు జడ్పీటీసీగా విజయం సాధించిన ఇప్పల వెంకట కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు 

ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామ నియోజకవర్గం వీరులపాడు జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు ఇప్పల వెంకట కృష్ణారెడ్డి తలపెట్టిన జయంతి నుంచి జమలాపురం పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పల వెంకట కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ అధికారం లేకపోయినా వైయ‌స్ఆర్‌సీపీకి అండగా నిలుస్తూ వీరులపాడు మండలం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన మండల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Back to Top