అందరి జీవితాలు శోభాయ‌మానంగా వెలుగొందాలి

తెలుగు ప్రజలకు వైయ‌స్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
 

తాడేపల్లి :   వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటేనే ఉజ్వల కాంతి అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయమని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.

సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలనీ, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలనీ, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Back to Top