పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు 

మార్కాపురం జిల్లా: టీడీపీ గూండాలు ఐదు సార్లు దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించేసినా.. ఏ మాత్రం వెనక్కితగ్గకుండా నామినేషన్‌ వేసిన ప్రకాశం జిల్లా సూద­న­గుంట వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం సూదనగుంట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని దొనపాటి శ్రావణి నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ప్రతి­సారీ పోలీసుల అండతో టీడీపీ గూండాలు చీర పట్టుకొనిలాగి, దాడి చేసి.. నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. టీడీపీ గూండాల దాడిలో శ్రావణి చేతికి గా­యమైంది. 

ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్ప.. టీడీపీ రౌడీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఐదుసార్లు ఆమె నామినేషన్‌ పత్రాలను చించేశారు. అయి­నా పట్టువదలకుండా అతికష్టం మీద శ్రావణి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచి్చనా నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. టీడీపీ గూండాలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా చివరకు టీడీపీ అభ్యర్థిని బీరం ధనలక్ష్మి­పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని శ్రావణి 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెను వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు, నియోజకవర్గ పరిశీలకుడు కేవీ రమణారెడ్డి అభినందించారు. 

Back to Top