విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్సీపీ సత్తా చాటింది. గణనీయమైన విజయాలను నమోదు చేసింది. కూటమి సర్కార్ అరాచకాలను ఎదుర్కొంటూ పలు జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,638 ఎంపీటీసీ స్థానాలు, 61 జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎదురైన సవాళ్లను అధిగమించి వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని అందుకున్నారు. కౌంటింగ్ సందర్భంగా రిగ్గింగ్, అక్రమాలు, దౌర్జన్యాలకు కూటమి పార్టీలు పాల్పడినా ప్రజలు మాత్రం వైయస్ఆర్సీపీ వైపు ఉన్నారు. అల్లూరి జిల్లా జడ్పీ పీఠం.. అల్లూరి జిల్లాలో వైఎస్సార్సీపీ మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 స్థానాలకు గాను ఏడు స్థానాల్లో విజయం సాధించింది. చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, జీకే వీధి, డుంబ్రిగూడ, పాడేరు, హుకుంపేట జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. విజయనగరం జిల్లాలో ఐదు జడ్పీటీసీ స్థానాలు విజయనగరం జిల్లాలో వైయస్ఆర్సీపీ సత్తా చాటింది. పార్టీ అభ్యర్థులు ఐదు జడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్నారు. జామిలో తులసి త్రివేణి, గజపతినగరంలో సూర్యకళ, నెల్లిమర్లలో మత్స విజయలక్ష్మి, గరివిడిలో బొత్స పూజిత, గుర్లలో సంగంరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. మన్యం జిల్లాలో విజయాలు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైఎస్సార్సీపీ ఐదు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. సాలూరులో అనంతలక్ష్మి, మక్కువలో మర్రి పారమ్మ, గుమ్మలక్ష్మీపురంలో గౌరీ శంకరరావు, సీతంపేటలో సరస్వతి, పార్వతీపురంలో నవ్యశ్రీ విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో 63 ఎంపీటీసీ స్థానాలు కృష్ణా జిల్లాలో వైయస్ఆర్సీపీ 63 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. గన్నవరం మండల జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించారు. అలాగే, అన్నమయ్య జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలో సదుం జడ్పీటీసీగా పుట్టరాజు, మదనపల్లె వైఎస్సార్సీపీ జడ్పీటీసీగా జన్నే కిరణ్మయ్ విజయం సాధించారు. అనంతలో వైఎస్సార్సీపీ మార్క్.. మరోవైపు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ 11 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కదిరి నియోజకవర్గంలో నాలుగు, ధర్మవరం నియోజకవర్గంలో రెండు, శింగనమల నియోజకవర్గంలో రెండు, పుట్టపర్తి నియోజకవర్గంలో మూడు స్థానాలను కైవసం చేసుకుంది. మరుట్ల ఎంపీటీసీ స్థానంలో మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడినప్పటికీ వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. ముదిగుబ్బ జడ్పీటీసీ స్థానంలోనూ మంత్రి సత్యకుమార్ వర్గీయులు అక్రమాలకు పాల్పడినా విజయం మాత్రం వైఎస్సార్సీపీ విజయం అందుకుంది. కాగా.. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో వెలువడిన ఫలితాలు వైయస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.