మరీ ఇంత నీచానికి దిగజారుతారా?: విక్రమ్‌రెడ్డి 

నెల్లూరు: ఆత్మకూరులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. నామినేషన్ల దగ్గర నుంచి అరాచకాలు మొదలు పెట్టారంటూ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కూట్నీ, విత్ డ్రాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు అక్రమంగా తొలగించారు. ఎస్‌ఈసీ, కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వీరి అక్రమాలు రికార్డ్ అవుతాయని సీసీటివీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఓటమి భయంతో 37కు 30 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మునిసిపల్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ మెజారిటీతో కొత్త వ్యూహాలకు తెరతీశారు. కేవలం మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఆనం రామనారాయణరెడ్డి ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని నన్ను, వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిర్బంధించి రిగ్గింగ్ చేసుకున్నారు’’అని  విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఒక ఏజెంట్‌గా పోలింగ్, కౌంటింగ్‌కు వెళ్ళే హక్కు ఉన్నా నన్ను అడ్డుకున్నారు. అనుమతి లేని మంత్రి ఆనంను మాత్రం పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలకు ఎలా అనుమతించారు? మర్రిపాడు సీఐ గంగాధర్, ఎసై బలరాం రెడ్డిలే స్వయంగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. ఇక కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ లీడింగ్‌లో ఉన్న స్థానాలు తారుమారు చేశారు. కొన్ని స్థానాలలో వైఎస్సార్‌సీపీ గెలుపొందినా రీ-కౌంటింగ్ పేరుతో టిడిపీ గెలుపు ప్రకటించుకున్నారు. రిజల్ట్ వన్ సైడ్ చేసుకోవడం మరీ ఇంత నీచానికి దిగుతారా..?’’ అంటూ విక్రమ్‌రెడ్డి దుయ్యబట్టారు.

Back to Top