అనంతపురం: శింగణమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3, ఎంపీటీసీ–4 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు ఘన విజయం సాధించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి సతీమణి నార్పల స్వాతిలతారెడ్డి 984 ఓట్ల భారీ మెజార్టీతో, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు నార్పల శ్రీనివాసరెడ్డి సతీమణి నార్పల ప్రసన్నకుమారిరెడ్డి 599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు వైయస్ఆర్‌సీపీ తరఫున బరిలోకి దిగి భారీ మెజార్టీలతో విజయం సాధించడం నార్పలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజయంతో ఇద్దరి గురించి రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ సాగుతోంది. నార్పల ఎంపీటీసీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇద్దరు మహిళా అభ్యర్థులు సాధించిన భారీ మెజార్టీలు స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.