కడప జైలులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను పరామర్శించిన అంజాద్‌ బాషా

వైయ‌స్ఆర్ జిల్లా: కడప కేంద్ర కారాగారంలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి. అంజాద్‌ బాషా పరామర్శించారు. ఆయనతో పాటు పార్టీ సీఈసీ సభ్యులు కే. సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతోందని అంజాద్‌ బాషా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను కేసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, దొంగ ఓట్లతో గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

అధికార బలంతో ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, పార్టీ కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంజాద్‌ బాషా భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి, అక్రమ కేసులకు బాధ్యులైన అధికారులు చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. 2029లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులను చట్టం ముందు నిలబెడతామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Back to Top