నెల్లూరు జిల్లా: గూడూరు టౌన్ 6, 7వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. టౌన్ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాసులు అధ్యక్షతన, గూడూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గోవిందు ప్రభాకర్, గోవిందు రాణెమ్మలతో పాటు గోవిందు సుబ్రహ్మణ్యం, గోవిందు రవి, గోవిందు శివ, కొల్లపూడి శశి, కొల్లపూడి సాయి, కంట్లం హరి, కంట్లం రవి, కంట్లం విజయలక్ష్మి, గూడూరు దొరబాబు, మాతంగి సురేఖ, సర్వేపల్లి శివ, కంట్లం వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి మొత్తం 25 కుటుంబాలు, సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు, పార్టీ టౌన్ నాయకులు మనుబోలు సతీష్‌రెడ్డి, విద్యాసాగర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.