విజయనగరం జిల్లా: గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలం పెద్దమజ్జిపాలెం గ్రామంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరాయి. వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరడం గజపతినగరం నియోజకవర్గంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.