ఆజాద్‌ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకం

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వైయస్‌ జగన్‌ నివాళులు 

తాడేప‌ల్లి: భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ట్వీట్ చేశారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని విశ్వసించిన ఆజాద్‌ ప్రతి ఒక్కరికీ విద్య అందేలా జీవితాంతం కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు.

దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన ఆజాద్‌ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top