జగన్‌ వెంటే నా రాజకీయ ప్రయాణం

వైయ‌స్ఆర్‌సీపీని వీడే ప్రసక్తే లేదు.. గంగుల బ్రిజేంద్రరెడ్డి స్పష్టం  

నంద్యాల జిల్లా: తాను వైయ‌స్ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయ‌స్ఆర్‌సీపీలోనే కొనసాగుతానని, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని తేల్చిచెప్పారు.

తాను పార్టీని వీడుతున్నట్లు పచ్చ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తోందని గంగుల బ్రిజేంద్రరెడ్డి మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదంటూ వస్తున్న వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలతో పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం ఇంతకాలం పోరాడి, ఎన్నో కేసులు ఎదుర్కొన్న తాము ఇప్పుడు పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గంగుల కుటుంబ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎవరూ అధైర్యపడవద్దని బ్రిజేంద్రరెడ్డి కోరారు. తనపై, పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Back to Top