శ్రీకాకుళంలో టీడీపీకి షాక్‌

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో టీడీపీకి షాక్ త‌గిలింది.  న‌గ‌రంలోని 15వ డివిజన్‌కు చెందిన వారణాసి శిరీష కుటుంబ సమేతంగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆమెకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కర్రి శివన్నారాయణ, పెద్దిన మురళి, నక్క రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top