రాజాంలో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పాలవలస పద్మావతి నామినేషన్

భారీ జనసందోహం మధ్య ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

రాజాం టౌన్: వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పాలవలస పద్మావతి భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆమె రాజాం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ బాబు, రాజాం నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డా. తలే రాజేష్, విజయనగరం మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. వీరితో పాటు రాజాం నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, వివిధ వార్డుల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలవలస పద్మావతి నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. ర్యాలీ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to Top