నినాదాలతో హోరెత్తిన గుడివాడ 

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ నామినేషన్ ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల జోష్

గుడివాడ: గుడివాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెరుగుమాల ప్రవీణ నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ సతీమణి అయిన ప్రవీణకు మద్దతుగా మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గుడివాడ వీధులు సందడిగా మారాయి. “జై జగన్.. జై కొడాలి నాని” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో నామినేషన్ ర్యాలీ హోరెత్తింది.

నామినేషన్ ర్యాలీ నెహ్రూ చౌక్‌ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం మధ్య ప్రవీణ నామినేషన్ కార్యక్రమం కొనసాగింది.

Back to Top