చిప్పగిరి సర్పంచ్‌ అభ్యర్థిగా లిఖితారెడ్డి నామినేషన్‌

 వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి 

క‌ర్నూలు జిల్లా: చిప్పగిరి మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా తిమ్మారెడ్డి కోడలు  లిఖితారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల సమక్షంలో నామినేషన్‌ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తిమ్మారెడ్డి కుటుంబం తరఫున లిఖితారెడ్డి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్‌ దాఖలు చేసిన లిఖితారెడ్డిని ఈ నెల 26న జరిగే పోలింగ్‌లో అత్యధిక మెజారిటీతో గెలిపించి చిప్పగిరి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.

వైయ‌స్ఆర్‌సీపీకి బలమిచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా నిలవాలని ఎమ్మెల్యే విరుపాక్షి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్, డాక్టర్‌ కిరణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ సురేష్‌రెడ్డి, ఎంపీటీసీలు చెరువు మహానంది, కొలిమి సర్వర్‌ఖాన్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూటూరు మారయ్యతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Back to Top