తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపాయి. రౌతుసూరిమాల గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు, సర్పంచ్ అభ్యర్థి నాగరాజు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. ఈ ఘటనలో నామినేషన్ పత్రాలను చింపివేసి, నాగరాజు తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. గాయపడిన నాగరాజును శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం, అభ్యర్థులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది. అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించి, దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.