కాకినాడ జిల్లా : కిర్లంపూడి ఏనుగు వీధి, కాపుల రామాలయం వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ముద్రగడ గిరిబాబు గురువారం ఉదయం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గిరిబాబు తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులు, సంస్కరణల వల్లే బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపుల వీధి పెద్దలు, ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు.