ఆలూరు: చిప్పగిరిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో కమ్మరచేడు నూతన ఎంపీటీసీ దాసరి గోవిందరావు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఆయనను ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలకు అభినందనలు తెలిపారు. ఎంపీటీసీగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కమ్మరచేడు, ముసనహళ్లి, కత్రికి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలని అన్నారు. వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచిన ప్రజల నమ్మకాన్ని ప్రజా సేవ ద్వారా నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. తనను ఎంపీటీసీగా గెలిపించిన ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు దాసరి గోవిందరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.