నేను విన్నాను.. నేను ఉన్నాను

రాప్తాడు రాక్షసుడి బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ

గోపికను రక్షించే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మికి రూ.3 లక్షలు.. 

యర్రగుంట విద్యార్థి బిలాల్ చికిత్సకు రూ.5 లక్షల సాయం

ఆపదలో ఉన్నవారి కన్నీటిని చూసి కదిలిపోయే మనసు.. వారి బాధను విని తన బాధ్యతగా భావించే నాయకత్వం.. కష్టకాలంలో మాటలకే పరిమితం కాకుండా చేతలతో అండగా నిలిచే మానవీయత వైయస్ జగన్‌ది. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి, అవసరమైన సమయంలో ఆపన్నహస్తం అందించడం ఆయనకు రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రజల పట్ల ఉన్న ఆత్మీయ బాధ్యత.

బిడ్డ చికిత్స కోసం వచ్చిన కుటుంబానికి అండగా..

బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యర్రగుంట విద్యార్థి బిలాల్ తల్లిదండ్రులు తమ బిడ్డ వైద్యం కోసం వైయస్ జగన్‌ను ఆశ్రయించారు. వారి పరిస్థితిని చూసిన వైయస్ జగన్ తప్పకుండా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగా రోజుల వ్యవధిలోనే బిలాల్ చికిత్సకు రూ.5 లక్షల సాయం అందింది. దీంతో బిలాల్ తల్లిదండ్రులు వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రాప్తాడు బాధిత కుటుంబానికి ‘నేనున్నాను’ అనే భరోసా..

గోపికను రక్షించే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మిని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరామర్శించి, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ భరోసాకు కొనసాగింపుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు.

మాటకు విలువ.. మానవీయతకు ప్రతిరూపం

ఒక కుటుంబానికి బిడ్డ చికిత్స కోసం రూ.5 లక్షల సాయం.. మరో కుటుంబానికి ఆపద సమయంలో రూ.3 లక్షల చేయూత.. ఇవి కేవలం ఆర్థిక సాయాలు మాత్రమే కాదు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ‘మీకు మేమున్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చే మానవీయ స్పందన. బాధను విని.. పరిస్థితిని అర్థం చేసుకుని.. అవసరమైన సమయంలో అండగా నిలిచే వైయస్ జగన్ నాయకత్వానికి ఇవి నిలువెత్తు ఉదాహరణలు.

కష్టంలో ఉన్నవారి కన్నీటిని తుడవడం.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.. ప్రజలతో వైయస్ జగన్‌కు ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతిబింబం. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే మాటను చేతల్లో చూపించే మానవీయ నాయకత్వం ఆయనది. 

Back to Top