వైయస్సార్‌సీపీలో చేరికలు

కాకినాడ మేయర్‌ ఎన్నికల్లో వైయస్సార్‌సీసీ అభ్యర్థిగా కాద సత్యశ్రీ.

 కాకినాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ కాద వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో సహా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్‌ కాద వెంకటరమణ సతీమణి కాద సత్యశ్రీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా కాకినాడ మేయర్‌ పదవికి పోటీ చేస్తున్నారు.
    మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వారు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, పారీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు ఈ  కార్యక్రమంలో ´ల్గొన్నారు.

Back to Top