తాడేపల్లి: నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నాయుడుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో పరిణామాలను వివరించారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు రాజేశ్వరమ్మను, శ్రీ వైయస్ జగన్ అభినందించారు. ప్రజలకు చేరువై నిత్యం వారితో మమేకం అవుతూ, వారి కష్టాలు తీర్చేందుకు పని చేయాలని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఆమెకు సూచించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సంజీవయ్య ఆధ్వర్యంలో రాజేశ్వరమ్మ శ్రీ వైయస్ జగన్‌ను కలవగా, ఆమె వెంట ఆమె భర్త తంబిరెడ్డి జనార్థర్‌రెడ్డితో పాటు, కుటుంబ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యరెడ్డి, పార్టీ నాయుడుపేట అధ్యక్షుడు కె.మాధవరెడ్డి, నాయుడుపేట రూరల్ అధ్యక్షుడు కిషోర్‌యాదవ్ ఇంకా, పార్టీ నియోజకవర్గం అబ్జర్వర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.