బాలల భవిష్యత్తుకు విద్య, భద్రతతో కూడిన వాతావరణం అవసరం

మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు 

తాడేపల్లి: ప్రతి చిన్నారికి కలలు కనడానికి, నేర్చుకోవడానికి, సురక్షితమైన మరియు ప్రోత్సాహకరమైన వాతావరణంలో జీవించడానికి హక్కు ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బాలల విద్య, సంక్షేమంపై ఈరోజు పెట్టే పెట్టుబడే వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.

చిన్నారులకు అవసరమైన విద్య, అవకాశాలు, భద్రత కల్పిస్తూ వారిని శక్తివంతం చేయడం మనందరి బాధ్యతని వైయస్‌ జగన్‌ తెలిపారు. వారికి తగిన భవిష్యత్తును అందిస్తే, రేపటి రోజుల్లో దేశ అభివృద్ధిని ముందుకు నడిపించే శక్తిగా వారు ఎదుగుతారని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దేశంలోని చిన్నారులందరికీ వైయస్‌ జగన్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

Back to Top