తాడేపల్లి: ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ నుంచి కొత్తగా ప్రారంభం కావటంపై హర్షం. భారతదేశ ఆర్థిక ప్రగతి, అభివృద్ధి ప్రయాణంలో ఈ కొత్త పత్రిక కీలక పాత్ర పోషించాలి. భారత్ వృద్ధి ప్రస్థానం అత్యున్నత శిఖరాలకు చేరుకునే తరుణంలో.. ఈ పత్రిక అత్యున్నత సంపాదకీయ ప్రమాణాలను పాటించాలని కోరుకుంటున్నా. ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రయాణం విజయవంతం కావాలి. టీమ్ మొత్తానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’అని పేర్కొన్నారు.