నామినేషన్ పత్రాలు లాక్కున్న కూటమి వర్గీయులు

కడప జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం సంకెపల్లి పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థుల నుంచి కూటమి వర్గీయులు నామినేషన్ పత్రాలను లాక్కున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

నామినేషన్ ప్రక్రియను అడ్డుకునేలా అభ్యర్థుల పత్రాలను లాక్కోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

Back to Top