వైయస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల తీరుపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగుంట్ల మండలం పెద్దన్నపాడు, వలసపల్లె గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ముద్దనూరు పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే నిర్బంధించినట్లు వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముద్దనూరు, ఎర్రగుంట్ల పోలీసులు అభ్యర్థులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేలా పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసులు కూటమి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.