షర్మిల వద్ద ఒక్క ఆధారమైనా ఉందా? 

యలహంక ఆస్తి ఉమ్మడిగా ఉంటే వైఎస్సార్‌ కుటుంబ సభ్యులపేరు మీద ఉండాలి కదా? 

వైఎస్‌ భారతి తల్లి సుగుణమ్మ పేరుతో ఎందుకు రిజిస్ట్రేషన్‌ అయ్యింది?  

22 ఏళ్లుగా షర్మిలని అందులో ఉండనివ్వడమే జగన్, భారతి చేసిన తప్పా?  

 వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ రెడ్డి సూటి ప్రశ్నలు  

ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల అరాచకాల నుంచి దృష్టి మళ్లించే పన్నాగమని మండిపాటు  

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా : చంద్రబాబుకు, టీడీపీకి ఎప్పు­డు గడ్డుకాలం వచ్చినా.. తండ్రీకొడుకు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగినా.. దాని నుంచి దృష్టి మళ్లించడానికి రకరకాల పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు పన్నడం చంద్రబాబు­కు కొత్తేమీ కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడు­తూ షర్మిలకు ప­లు ప్రశ్నలు సంధించారు. ‘గత 40 రోజులుగా రా­ష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ఒక ప్రహసనంగా, నవ్వులాటగా మారాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పో­లింగ్‌కు రానివ్వకుండా అడ్డుకోవడం, కష్టపడి నామినేషన్‌ వేస్తే రిటర్నింగ్ ఆఫీస్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను చించేయడం వంటి దౌర్జ­న్యా­లు చేస్తున్నారు. 

నాగులగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకు­లు దౌర్జన్యంగా చించివేశా­రు. దీనిపై ప్రతిపక్షం కా­దు, స్వయంగా వారి మి­త్రపక్షమైన జనసేన కా­ర్యకర్తలు, కడప జిల్లా జనసే­న అధ్యక్షుడే రోడ్లపైకి వ­చ్చి 2–3 గంటల పాటు రో­డ్లు బ్లాక్‌ చేసి, పోలీ­సు­లు, టీడీపీ గూండాలతో కు­మ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అరా­చకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికేషర్మిల­ని ట్రాప్‌లో వేసి ఈ కొత్త ఎత్తుగడ వేశారు’ అని సతీష్‌కుమార్‌రెడ్డి చె­ప్పా­రు. ఈ సందర్భంగా ఆ­యన ఇంకా ఏమన్నారంటే..  

1995లోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆస్తుల పంపకాలు 
చంద్రబాబు ట్రాక్‌ తీసుకోవడం, ఆయన మౌత్‌పీస్‌గా మారడం, ఆయనకు అవస­రం ఉన్నప్పుడల్లా వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం షర్మిలకు కొ­త్తేమీ కాదు. ఈ వ్యవహారం వెనుక 200 శాతం చంద్రబాబే ఉన్నా­రు. మా ప్రాంతం, మా సామాజిక వర్గం సంప్రదాయం ప్రకారం ఆడ పిల్లలకు పెళ్లి సమయంలోనే ఆస్తులు స్పష్టంగా కేటాయించి అప్పజెప్పుతారు. మిగిలినవే మగ పిల్లలకు ఇస్తారు. 1995లో అనిల్‌తో షర్మిల వివా­హం జరిగినప్పుడే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆస్తుల పంపకాలు పూర్తి చేశారు. బంజారా­హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని తన ఇంటిని జగన్‌కు ఇచ్చి, ఆ ఇంటి వెనుకే 283–290 గజాల్లోషర్మిలకు ఇల్లు కట్టించి ఇచ్చారు. పులివెందులలో 5.5–6 ఎకరాలు, వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌లో జగన్‌తో సమానంగా వాటా ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా ఉన్న స్థిరమైన ఆస్తి ‘విజయలక్ష్మి మినరల్స్‌’లో పూర్తి వాటాను షర్మిలకే ఇచ్చారు. ఆస్తుల పంపకాలు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడు ఉమ్మడి ఆస్తి అంటూ ఏమీ లే­దు. ఎవరి ఆస్తులు వారివే. పెళ్లి సమయంలోనే ఆ­స్తులు పంచి ఇచ్చిన తర్వాత రెండోసారి, మూడో­సారి మళ్లీ క్లెయిమ్‌ చేసే పరిస్థితి ఎక్కడైనా చూశారా? 

ఏ అధికారంతోషర్మిల అక్కడికి వెళ్తున్నారు?  
2007 మార్చి 1న సుగుణమ్మ ఆ ఆస్తిని సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 20 ఏళ్ల లీజుకు ఇచ్చారు. ఆ సంస్థలో ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న భారతి అక్కడ నివాసం, బంధువుల ప్రైవసీ కోసం ముందు భాగంలో గెస్ట్‌ హౌస్‌ కట్టించారు. 2026 ఆగస్టు 27న సుగుణమ్మ ఆ ఆస్తిని తన కుమార్తె భారతి, మనవరాళ్ల పేరున గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు వెనకుండి నడిపే ‘ఈనాడు’ పత్రికే స్పష్టంగా రాసింది. ఒకవైపు ‘చెల్లెమ్మను రానివ్వలేదు, బయటకు తోసేశారు, నో ఎంట్రీ’ అని రాస్తూనే, మరోవైపు సుగుణమ్మ గిఫ్ట్‌ డీడ్‌ వివరాలను ఆ పత్రికే బయట పెట్టింది. మరి ఏ హక్కుతో, ఏ అధికారంతో షర్మిల అక్కడికి వెళ్తున్నారు? మిగతా వారు ఎలా మద్దతు ఇస్తు­న్నారు? చెల్లెలు ఇంటికి వస్తే ఎవరైనా ఉండమ్మా అంటారు. ఎప్పుడు వచ్చినా ఆమెను అడ్డుకోకుండా గెస్ట్‌ హౌస్‌లో ఉండనివ్వడమే జగన్, భారతి చేసిన తప్పా? అదే వారికి శాపమైందా?    

చంద్రబాబు తన అక్కచెల్లెళ్లకు ఎంత ఆస్తి పంచిచ్చారు?  
అయ్యా.. చంద్రబాబూ.. మీకు కూడా ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. చిన్న వయసులోనే ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని పక్కకు వచ్చి, ఈరోజు హెరిటేజ్‌ అంటూ వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకున్నారు. ఈ రోజు మీ చెల్లెళ్లు వచ్చి అడిగితే మీ వేల కోట్ల ఆస్తిలో వారికి వాటా పంచి ఇస్తారా? మీ అక్క చెల్లెళ్లకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారో చెప్పాలి. భువనేశ్వరితో 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో సంసారం చేస్తున్న మీ ఇంట్లో, ఒక్క రోజైనా మీ తల్లిని గానీ, తండ్రిని గానీ, అక్క­చెల్లెళ్లను గానీ వచ్చి నిద్ర చేయనిచ్చిన సందర్భం ఉందా? ఈ వివాదాల స్క్రిప్ట్‌ మొత్తం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ–5 తయారు చేస్తున్నాయి. రూ.వేల కోట్ల ఆసామిగా మారిన రాధాకృష్ణకు కూడా అక్కచెల్లెళ్లు ఉన్నారు. మరి ఆయన వారికి ఎంత ఆస్తి పంచి ఇచ్చారో చెప్పాలి. వారికొక రూలు.. జగన్‌కు ఒక రూలా? భారతదేశ రాజకీయాల్లో ‘డర్టియెస్ట్ పొలిటీషియన్‌’ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని కేసీఆర్‌ ఊరకే అనలేదు.  

యలహంక భవనం వైఎస్‌ భారతి తల్లి ఆస్తి 
యలహంక భవనంలో షర్మిలకు ఎలాంటి వాటా గానీ, హక్కు గానీ లేదు. అది వైఎస్‌ కుటుంబానికే సంబంధం లేని ఆస్తి. 2006లో భారతి తల్లిదండ్రులు.. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్‌ ఈసీ సుగుణమ్మ తమ రోరింగ్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌ ద్వారా సంపాదించిన డబ్బుతో 23 ఎకరాల ఆస్తిని సుగుణమ్మ పేరు మీద కొనుగోలు చేశారు. కడప జిల్లాలో.. పులివెందులలో వారి సంపద, 30 ఏళ్ల ప్రాక్టీస్‌ గురించి ఎవరైనా ప్రశ్నించగలరా? అది నిజంగా రాజశేఖరరెడ్డి ఆస్తి గానీ, ఉమ్మడి ఆస్తి గానీ అయి ఉంటే, ఆయన పేరు మీదో, విజయమ్మ, వివేకానంద రెడ్డి, జగన్‌ లేదా షర్మిల పేరు మీదో ఉండేది. వీరెవరి పేర్లూ కాకుండా సుగుణమ్మ పేరు మీద ఎందుకు ఉంటుంది? అది పూర్తిగా వైఎస్‌ భారతికి తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి. ఒక ఆడబిడ్డకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తిని క్లెయిమ్‌ చేయడం అర్థం కావడం లేదు. 20 ఏళ్లుగా నేను అక్కడ సంసారం చేస్తున్నాను.. అది నా ఆస్తి.. అని చెబుతున్న షర్మిల, ఒక్క చిన్న ప్రూఫ్‌ అయినా చూపించగలరా? ఏ రోజైనా ఒక్క కరెంట్‌ బిల్లు గానీ, వాటర్‌ బిల్లు గానీ ఆమె కట్టారా? ఒక్క చిన్న బిల్లు కూడా ఆమె కట్టలేదు. అవన్నీ సిలికాన్‌ డెవలపర్స్‌ సంస్థే కడుతోంది.

Back to Top