నంద్యాల జిల్లా: పాములపాడు మండలం బానకచర్లలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బానకచర్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించి, నామినేషన్ వేసేందుకు సిద్ధంగా వచ్చిన వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులను నామినేషన్ వేసేందుకు అనుమతి లేదంటూ వెనక్కి పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీడీపీ మద్దతుదారులకు పాములపాడు ఎస్‌ఐ తిరుపాలు దగ్గరుండి నామినేషన్ వేయిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఒకే ఎన్నికల ప్రక్రియలో రెండు వర్గాలకు పోలీసులు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డాయి.