ప్రొద్దుటూరు: స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేడు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదంటూ ప్రొద్దుటూరు రూరల్ ఎస్‌ఐ మల్లికార్జున, సీఐ శివశంకర్ నాయక్ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తనను హౌస్ అరెస్ట్ చేయడంపై వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరాయి.