కృష్ణా జిల్లా: కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిపై సింహాద్రిపురం అంకాలమ్మగూడూరులో జరిగిన దాడిని వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం జోన్-3 అధ్యక్షురాలు మైల రత్నకుమారి ఖండించారు. నామినేషన్ ప్రక్రియకు వెళ్తున్న ఎంపీ, వైయస్ఆర్‌సీపీ నాయకులపై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. రత్నకుమారి ఏమన్నారంటే.. “సింహాద్రిపురం అంకాలమ్మగూడూరులో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిపై, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడం అత్యంత దారుణం. నామినేషన్ల ప్రక్రియలో ఉన్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి దాడి జరిగితే ఇక సామాన్య ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ ఎక్కడుంది? ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎన్నికల సంఘం కళ్లముందే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు ఎన్నికలను టీడీపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేసుకునే హక్కును అడ్డుకుంటూ, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు పోలీసు అధికారుల్లో కొంతమంది అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఎన్నికలను తమకు అనుకూలంగా నడిపించాలని చూస్తున్నారు. ప్రజల ముందే దాడులు జరుగుతుంటే వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం. పోలీసుల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎవరికి అండగా నిలుస్తున్నారో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దారెడ్డి ఇంటిపై దాడిని కూడా పక్కదారి పట్టించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, టపాసులతో దాడి జరిగిన ఘటనను కూడా కొంతమంది పోలీసు అధికారులు వాస్తవాలను వక్రీకరించి కేవలం టపాసుల వల్లే జరిగిందన్నట్టుగా చిత్రీకరించడం దారుణం. దాడి చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే నిందలు మోపే పరిస్థితి ఎందుకు వచ్చింది? వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు ఎన్ని దాడులు చేసినా వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు. మా నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాకు నేర్పింది భయపడటం కాదు.. ప్రజల కోసం ధైర్యంగా నిలబడటం. టీడీపీ, జనసేన కూటమి అరాచకాలకు భయపడి మా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రజలే తగిన సమాధానం చెబుతారు అధికార బలంతో, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ‘రెడ్‌బుక్’ పేరుతో భయపెట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్నికల్లో ప్రజలే ఈ అరాచక రాజకీయాలకు తగిన సమాధానం చెబుతారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అధికార పార్టీ కాదు.. ప్రజలే. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం అవుతుంది.”