చిలకలూరిపేట: నాదెండ్ల మండలంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులను పోలీసులు నిర్బంధించి నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నాయి. తమ పార్టీ నాయకులను ఎందుకు అరెస్టు చేశారో ప్రశ్నించేందుకు మాజీ మంత్రి విడదల రజినీ నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో డీఎస్పీ హనుమంతరావు, సీఐ సుబ్బనాయుడు పోలీసు బలగాలతో ఆమెను అడ్డుకుని చిలకలూరిపేటలోని నివాసానికి తిరిగి తీసుకెళ్లారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం రజినీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆమెను గృహనిర్బంధం చేశారని పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయస్ఆర్‌సీపీ వర్గాలు మండిపడ్డాయి.