వైయస్ఆర్ జిల్లా: నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొండూరు మండలం అగడూరులో నామినేషన్ వేయడానికి వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన అనంతరం, తిరిగి వైయస్ఆర్‌సీపీ నేతలపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో వీరారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట సమయంలో వారిని తొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పోలీసులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో అనంతరం లింగాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ అవినాష్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ కన్వీనర్ ఓబుల్‌రెడ్డి లింగాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేదన్న వాదన వీరారెడ్డి, మరో తొమ్మిది మందిపై క్రైమ్ నంబర్ 48/2026 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 20వ తేదీ రాత్రి 10 గంటలకు వారిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు నిందితులను కోర్టులో హాజరుపరచలేదని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ కన్వీనర్ ఓబుల్‌రెడ్డి వాదించారు. లింగాల పోలీస్‌స్టేషన్‌లో 19వ తేదీ రాత్రే అరెస్ట్ చేసినట్లు నమోదైన ఆధారాలను మేజిస్ట్రేట్ చంద్రశేఖర్‌రెడ్డి ముందు సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం బెయిల్ అరెస్టు, కోర్టులో హాజరుపరచడంపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని ఓబుల్‌రెడ్డి మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం మేజిస్ట్రేట్ చంద్రశేఖర్‌రెడ్డి వీరారెడ్డితో పాటు మిగిలిన తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేశారు. నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, దాడికి సంబంధించిన వాస్తవాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.