వైయస్సార్ జిల్లా : చక్రాయపేట నామినేషన్ కేంద్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్‌చల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చక్రాయపేట జడ్పీటీసీ భర్త భాస్కర్‌రెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు అభ్యర్థులు ఆరోపించారు. నామినేషన్ కేంద్రంలో టీడీపీ నేతలు ఎద్దుల చంద్ర, మావిరెడ్డి, 307 ముద్దాయి, రౌడీషీటర్ ప్రవీణ్ తదితరులు గందరగోళానికి పాల్పడుతూ భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చించేందుకు, ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలి నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు తక్షణమే స్పందించి చక్రాయపేట నామినేషన్ కేంద్రంలో భద్రతను పెంచాలని అభ్యర్థులు కోరారు. నామినేషన్ పత్రాలకు రక్షణ కల్పించడంతో పాటు, కేంద్రంలోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.