నాగలవెల్లటూరులో నామినేషన్ల తిరస్కరణపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

నామినేషన్ల తిరస్కరణపై సమగ్ర విచారణకు డిమాండ్

నెల్లూరు జిల్లా: చేజర్ల మండలం నాగలవెల్లటూరు నామినేషన్ కేంద్రం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించారని ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వేలూరు తిరుపతి నాయుడు, ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, నాగా నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని, నామినేషన్ల తిరస్కరణపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాలని స్పష్టం చేశారు.

Back to Top